మహేష్, పవన్ సినిమాలకు రాజమౌళి స్పెషల్ థాంక్స్.!

Published on Dec 21, 2021 3:58 pm IST

తెలుగు సినిమా వద్ద పండుగలు వచ్చాయి అంటే కొత్త సినిమాలతో ఆ పండుగ వేరే లెవెల్లోకి వెళుతుంది. అలా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి గాను పలు భారీ సినిమాలు తమ డేట్స్ లో అదరగొట్టేందుకు సిద్ధంగా కూడా ఉన్నాయి. అయితే ఈ రేస్ లో మొట్టమొదటగా సూపర్ స్టార్ మహేష్ బాబు అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ సినిమా “భీమ్లా నాయక్” లు డేట్స్ అనౌన్స్ చేసాయి.

తర్వాత ప్రభాస్ భారీ సినిమా రాధే శ్యామ్ కూడా ఇదే రేస్ లోకి రావడం జరిగింది. ఇక ఈ టైట్ రేస్ లో మరో పాన్ ఇండియన్ సినిమా “RRR” కూడా యాడ్ అవ్వడంతో ముందే మహేష్ తన సినిమాని రిలీజ్ ని బాక్సాఫీస్ దృష్ట్యా నిర్మాతల దృష్ట్యా ఏప్రిల్ కి షిఫ్ట్ చేశారు. ఇక భీమ్లా రిలీజ్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ అయ్యే ఉండడంతో భీమ్లా వాయిదా పట్ల సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది.

ఇక ఈ సినిమా రిలీజ్ పై ఈరోజు క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సమయంలో దర్శకుడు రాజమౌళి మహేష్ మరియు పవన్ అలాగే నిర్మాత దిల్ రాజు లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహేష్ సర్కారు వారి పాట సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అయినా గౌరవంతో సమ్మర్ కి షిఫ్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని..

అలాగే పరిస్థితిని అర్ధం చేసుకొని సినిమా బీమ్లా నాయక్ సినిమాని కూడా ఫిబ్రవరికి మార్చినందుకు అలాగే ఆ సినిమా కోసం తమ ఎఫ్ 3 డేట్ ని షిఫ్ట్ చేసుకున్నందుకు భీమ్లా నిర్మాతలు, పవన్ కి అలాగే నిర్మాత దిల్ రాజు కి రాజమౌళి ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం :