తన “RRR” హీరోలకి యూఎస్ లో ఇచ్చిన రెస్పాన్స్ కి జక్కన్న థాంక్స్.!

Published on Oct 2, 2022 8:00 am IST

సెన్సేషనల్ గ్లోబల్ హిట్ “రౌద్రం రణం రుధిరం” చిత్రం నిన్ననే యూఎస్ లో జరిగినటువంటి ఓ గ్రాండ్ స్పెషల్ షో లో ప్రదర్శితం అయ్యిన సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటించిన ఈ చిత్రం ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో అనేక మంది విదేశీయ ఆడియెన్స్ తో కలిసి చిత్ర దర్శకుడు జక్కన్న రాజమౌళి కూడా ఇందులో పాల్గొన్నారు.

మరి రాజమౌళి ఎంట్రీ కి అయితే అక్కడ సెన్సేషనల్ రెస్పాన్స్ కూడా రావడం అయితే మన తెలుగు సినిమాకే గర్వకారణం అని చెప్పొచ్చు. అలాగే సినిమాని కూడా ఆడియెన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తూ చూడటంతో రాజమౌళి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. నా హీరోలకి మీరు అందించిన ఆదరణ మరవలేనిది అని యూఎస్ ఆడియెన్స్ అందరికీ స్పెషల్ థాంక్స్ చెబుతున్నానని రాజమౌళి అయితే ఓ వీడియోతో దాన్ని షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :