
సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ రోజు సాయంత్రం కూకట్ పల్లిలో నిర్వహించనున్న రోడ్ షోలో లోక్ సత్తా పార్టీ జయప్రకాశ్ నారాయణతో కలిసి పాల్గొననున్నారు. ‘ఈ రోజు సాయంత్రం జరిగే రోడ్ షోలో డా. జెపి తో కలిసి పాల్గొంటున్నాను. అదొక బాధ్యతలా ఫీలవుతున్నానని’ రాజమౌళి ట్వీట్ చేసాడు.
మొదటి నుంచి రాజమౌళి లోక్ సత్తా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, అలాగే తనకి సమయం దొరికినప్పుడల్లా పార్టీ తరపున ప్రచారం కూడా చేస్తున్నాడు. ఇది కాకుండా రాజమౌళి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాకి చెందిన ఓ భారీ వార్ సీక్వెన్స్ ని ఇటీవలే పూర్తి చేసారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.