జక్కన్న రిలీజ్ చేయనున్న ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’ ఆడియో
Published on Sep 10, 2015 7:07 pm IST

lol
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన జగదీష్ తలసిల దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’. ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సూపర్ పెయిర్ నవీన్ చంద్ర – లావణ్య త్రిపాటి మరోసారి జంటగా నటించిన ఈ సినిమాని మయుఖ క్రియేషన్స్ బ్యానర్ పై సాయి ప్రసాద్ కామినేని నిర్మించారు. దాదాపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ లోగోని ఇటీవలే లాంచ్ చేసారు. కీరవాణి ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయడమే కాదు ఎంఎం కీరవాణి సంగీతం కూడా అందించాడు.

షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆడియోని అక్టోబర్ మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆడియో తేదీ ఫిక్స్ చేయకపోయినా ఆడియో కి రాబోయే చీఫ్ గెస్ట్ ని మాత్రం ఫిక్స్ చేసింది ఈ టీం. అతనే మన జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి. తన శిష్యుడు జగదీష్ జక్కన్న చేతుల మీదే రిలీజ్ చెయ్యాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా చాలా కామెడీగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పకనే తెలియజేస్తోంది. జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్నేష్ బాబులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి ఈశ్వర్ ఎల్లుమహంతి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook