RRR : మన రియల్ హీరోస్ ని నిజంగా మరో లెవెల్లో నిలబెట్టిన రాజమౌళి.!

RRR : మన రియల్ హీరోస్ ని నిజంగా మరో లెవెల్లో నిలబెట్టిన రాజమౌళి.!

Published on Jun 19, 2022 11:40 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ దగ్గర అసలు ఊహించని ఒక సెన్సేషనల్ మల్టీ స్టారర్ కాంబో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తోనే సాధ్యం అయ్యిందని చెప్పాలి. “బాహుబలి 2” లాంటి ఒక మెగా హిట్ తర్వాత రాజమౌళి నుంచి ఎలాంటి సినిమా ఉంటుంది? దాన్ని మ్యాచ్ చెయ్యగలిగే సినిమాతోనే వస్తాడా అనే ప్రశ్నలు ఎన్నో తలెత్తాయి. అప్పుడు అటు మెగా ఇటు నందమూరి స్టార్ హీరోస్ ని ఒకే సినిమాకి అనౌన్స్ చేసి బాహుబలి 2 ని మించిన హైప్ ని తీసుకొచ్చారు.

ఇక అక్కడ నుంచి ప్రతి అంశం కూడా ఈ సినిమా విషయంలో సెన్సేషనే.. సినిమా స్టార్ట్ చేసి ఇద్దరు హీరోస్ లుక్స్ ని మర్చి అప్పుడు ఒక ప్రెస్ మీట్ ని కూడా పెట్టి సినిమా ఎలా ఉంటుంది ఎలా తీయబోతున్నారు అనే దానిపై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అందించారు. అయితే అప్పట్లో రాజమౌళి ముందు ఒక ప్రశ్న వచ్చింది. బాహుబలి 2 లాంటి ఒక ఎపిక్ వారియర్ రోల్ ని మించేలా ఈ సినిమా ఉంటుందా అంటే..

రాజమౌళి “బాహుబలి అనేది ఒక ఫిక్షనల్ రోల్ కానీ ఈ సినిమాలో చేస్తుంది మన తెలుగు నేలకి చెందిన నిజమైన హీరోలు అందులోని స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతా రామరాజు, కొమురం భీమ్ లను ఇంకెలా చూపిస్తానో ఏ స్థాయిలో నిలబెడతానో అర్ధం చేసుకోవచ్చని సాలిడ్ స్టేట్మెంట్ ని తాను ఇచ్చారు. మరి అది 100 కి 100 శాతం మించే నిజం అయ్యిందని చెప్పాలి.

ముఖ్యంగా ఇంటర్నేషనల్ వైడ్ పాన్ వరల్డ్ లో ఈ సినిమాకి గాని ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి గాని వస్తున్న స్పందన చూస్తుంటే ఒక్కొక్కరికి షాకింగ్ గా ఉంది. అనేక మంది హాలీవుడ్ ప్రముఖులు అల్లూరి, భీమ్ పాత్రల్లో మన హీరోలని చూసి మెస్మరైజ్ అవుతున్నారు. మరి ఆ నిజ జీవిత హీరోలని ఈ స్థాయిలో చూపించి ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన క్రెడిట్ మాత్రం మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళికే దక్కుతుందని చెప్పాలి. ఇక నెక్ట్ వస్తున్న మహేష్ బాబుతో సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు