మహేష్ కోసం మోస్ట్ అమేజింగ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న జక్కన్న …. ?

Published on Jul 26, 2022 2:00 am IST

ఇండియాలోని మోస్ట్ అవైటెడ్ ప్రాజక్ట్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రానున్న మూవీ కూడా ఒకటి. ఫస్ట్ టైం సూపర్ స్టార్ తో రాజమౌళి పని చేస్తున్న ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనుండగా ఈ ప్రాజక్ట్ కి వి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ డ్రామా మూవీ గా ఈ మూవీ తెరకెక్కే అవకాశం కనపడుతుండగా ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ విషయమై జక్కన్న రాజమౌళి అమేజింగ్ స్టోరీ, స్క్రిప్ట్ సిద్ధం చేయించే ప్రయత్నాల్లో ఉన్నారట.

కొన్నాళ్లుగా తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటున్న రాజమౌళి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఇండియన్ మూవీ హిస్టరీ లో నిలిచిపోయే రేంజ్ లో దీనిని తెరకెక్కించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారట. మరోవైపు ఆడియన్స్ తో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కూడా ఈ మూవీ పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. తప్పకుండా అందరి అంచనాలు అందుకునేలా ఈ భారీ ప్రాజక్ట్ తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి పని చేయనున్న ఇతర క్యాస్టింగ్, టెక్నీషియన్స్ కి సంబంధించి పూర్తి వివరాలు అఫీషియల్ గా వెల్లడయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం :