రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా ….. ఇళయరాజా పై రజినీకాంత్ ప్రశంసలు

Published on Jul 7, 2022 12:30 am IST

భారతదేశ కేంద్రప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో మొత్తం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. వారు సంగీత దర్శకుడు ఇళయరాజా, కథకుడు విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పిటి ఉష, సామజిక సేవకుడు వీరేంద్ర హెగ్డే. అయితే ఈ నలుగురు దిగ్గజ ప్రముఖులని రాజ్యసభకు నామినేట్ చేయడం ఎంతో గర్వంగా ఉందని, ఆ నలుగురుకి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియచేసారు.

మరోవైపు సినిమా పరిశ్రమ నుండి ఇళయరాజా, విజయ్దేంద్ర ప్రసాద్ నామినేట్ కావడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు సినిమా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన చిరకాల మిత్రుడు, మంచి మనసు గల వ్యక్తి, సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభ మెంబెర్ గా నామినేట్ అవడంతో తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కొద్దిసేపటి క్రితం కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేకంగా ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియచేసారు. ప్రస్తుతం రజినీకాంత్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :