సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసిన రజినీ సినిమా.!

Published on Nov 25, 2021 7:05 am IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పెద్దన్న”. తమిళ్ లో “అన్నాత్తే” గా చాలా అంచనాలు నడుమ రిలీజ్ అయ్యింది. స్టార్ దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు లో కూడా ఎక్కువ అంచనాలు నడుమే విడుదల అయ్యింది. కానీ అనుకున్న స్థాయి విజయాన్ని కానీ టాక్ ని కానీ అందుకోలేదు. బట్ తమిళ నాట మాత్రం రజినీ క్రేజ్ మంచి వసూల్లే అందుకుంది.

మరి అక్కడ స్టడీ గానే ఉన్నా ఈ సినిమా అసలు ఎలాంటి అప్డేట్ కూడా లేకుండా సడెన్ గా డిజిటల్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నిన్న రాత్రి నుంచే ఈ చిత్రం తమిళ్ తెలుగు హిందీ తో పాటు అన్ని ఇతర భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసి ఆశ్చర్య పరిచింది. మరి ఇప్పుడు వరకు చూడని వాళ్ళు అయితే ఓటిటి లో ఈ సినిమాని చూడొచ్చు.

సంబంధిత సమాచారం :