రజనీ తొందరపాటుకు కారణం అదేనా !

13th, September 2017 - 04:05:25 PM


సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘రోబో-2, కాల’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘రోబో-2’ లో తనకు సంబందించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేసేశారు రజనీ. అలాగే ఈ మధ్యే ముంబైలో మొదలైన పా. రంజిత్ ‘కాల’ సినిమా చిత్రీకరణ కూడా అప్పుడే 70 % పైగా ముగిసినట్టు తెలుస్తోంది. ఇనాక్ మిగిలి ఉన్న 30 శాతం షూట్ ను ఈ అక్టోబర్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తారట.

ఈ మధ్యకాలంలో రజనీ సినిమా షూట్ ఇంత వేగంగా ముగింపు దశకు రావడం ఇదే మొదటిసారి. రజనీ ఇంత వేగంగా పనిచేయడానికి కారణం ఆయన రాజకీయ రంగప్రవేశమే అనే టాక్ వినబడుతోంది. త్వరలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని, అందుకే ఆలోపు ఇచ్చిన కమిట్మెంట్స్ అన్నీ ముగించుకుని పార్టీ పరమైన పనులలో నిమగ్నమవాలనే ఉద్దేశ్యంతో సినిమాల విషయంలో తొందరపడుతున్నారని అంటున్నారు. ఇకపోతే ‘రోబో-2’ ను 2018 జనవరిలో రిలీజ్ చేయనుండగా ‘కాల’ అదే యేడు వేసవికి రానుంది.