షూటింగ్ లో గాయపడిన ప్రముఖ హీరో !

యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సీనియర్ హీరో డా రాజ‌శేఖ‌ర్ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా కొన్ని యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రబృందం చిత్రీకరిస్తోంది. కాగా రాజశేఖర్ ఆ యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తుండగా గాయపడినట్లు తెలుస్తోంది. భుజానికి గాయం అయిందట. అయినా రాజశేఖర్ లెక్క చెయ్యకుండా షూటింగ్ కంప్లీట్ చేసి.. ఆ తరువాత హాస్పిటల్ కు వెళ్లినట్లు చిత్రబృందం ద్వారా తెలుస్తోంది.

కాగా ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని సమాచారం. గరుడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాజ‌శేఖ‌ర్ నటిస్తుండటం, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మొత్తానికి రాజ‌శేఖ‌ర్ ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు. మరి గరుడవేగ లాగే ఈ చిత్రం కూడా భారీ హిట్ అవుతుందేమో చూడాలి.

Exit mobile version