సంక్రాంతి బరిలోకి రాజశేఖర్ ‘శేఖర్’ !

Published on Jan 2, 2022 9:17 pm IST

సీనియర్ హీరో ‘రాజశేఖర్’ ప్రస్తుతం నటిస్తున్న మూవీ… ‘శేఖర్’. చాలా గ్యాప్ తర్వాత రాజశేఖర్ ఈ రీమేక్ చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన ఒక క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ఈ ‘శేఖర్’ మూవీ రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా పడటంతో సంక్రాంతి బరిలోకి శేఖర్ కూడా దిగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఎలాగూ ‘రాధేశ్యామ్’ సినిమా రిలీజ్ కూడా డౌట్‌ లో ఉంది. అందుకే, సడెన్ గా శేఖర్ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఆత్మీయ రజన్, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్ కి తప్పనిసరిగా హిట్ కావాలి, అందుకే ఈ సినిమా కోసం కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడట ఈ సీనియర్ హీరో.

నిజానికి ‘గరుడవేగ’తో రాజశేఖర్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. కానీ, ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో రాజశేఖర్ ఈ శేఖర్ సినిమా పైనే ఆశలు అన్ని పెట్టుకున్నాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ పై గట్తి నమ్మకంతో ఉన్నాడు. ఈ చిత్రాన్ని పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు.

సంబంధిత సమాచారం :