చిరంజీవిని కలిసి సినిమా చూడమన్న రాజశేఖర్ !

1st, November 2017 - 02:55:56 PM

సీనియర్ హీరో రాజశేఖర్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘పిఎస్వి గరుడవేగ’. రాజశేఖర్ కెరీర్లోనే అత్యధికంగా రూ.30 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం 3వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రంపై మొదటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు పాజిటివ్ క్రేజ్ కూడా ఉంది. ఇదివరకే విడుదలైన ట్రైలర్ మంచి స్పందనను దక్కించుకుని సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది.

దీంతో రాజశేఖర్ మిత్రుడైన మెగాస్టార్ చిరంజీవిని కలిసి తన సినిమా ప్రీమియర్ షోకి ఆహ్వానించారు. చిరంజీవి కూడా ట్రైలర్ చాలా బాగుందంటూ మెచ్చుకుంటూ ప్రీమియర్ చూస్తానని రాజశేఖర్ కు మాటిచ్చారు. ఈ ప్రీమియర్ రేపు 2వ తేదీన ప్రదర్శితం కానుంది. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన పూజా కుమార్ హీరోయిన్ గా నటించగా సన్నీ లియోనీ ప్రత్యేక గీతంలో నటించారు.