రిస్క్ చేస్తోన్న సీనియర్ హీరో !

‘గరుడ వేగ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ‘కల్కి’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ తన మొదటి సినిమా ‘అ’ తో మంచి పేరు తెచ్చుకోవటం.. రాజ‌శేఖ‌ర్ కూడా గరడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నటిస్తుండటంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ లో రెండు కోట్ల రూపాయలతో భారీ సెట్ ను నిర్మించారు. ఈ సెట్ లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. పైగా ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ డూప్ లేకుండా రిస్క్ చేసి మరి.. ఫైట్స్, జంప్స్ వంటి రిస్కీ షాట్స్ చేస్తున్నాడట. మొత్తానికి రాజ‌శేఖ‌ర్ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు. మరి గరుడవేగ చిత్రం లాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్‌ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

Exit mobile version