నా గోటీల ఫ్యాక్టరీ నుంచి ఫైనాన్స్ చేసాను – రాజశేఖర్ ఫన్ కామెంట్స్ వైరల్

Biker 3

మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో యాంగ్రీ యంగ్ మెన్ గా తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకొని ఇప్పటికీ వినూత్న సినిమాలు పాత్రలు చేస్తున్న నటుడు రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రమే “బైకర్”. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మధ్య అంతా తన సినిమాలు ఏమో కానీ తన గోటీల ఫ్యాక్టరీ కోసం వైరల్ అయ్యింది.

ఇది ఫేక్ స్టోరీ అయినప్పటికీ తన పేరును బాగా వైరల్ చేసింది. ఇప్పుడు ఇదే గోటీల ఫ్యాక్టరీ నుంచే ఈ సినిమాకి తను ఫైనాన్స్ చేసానంటూ ఫన్ కామెంట్స్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ లో తెలిపారు. దీనితో తన గోటీల ఫ్యాక్టరీ కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాకి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు. ఈ ఏప్రిల్ 3న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతోంది.

Exit mobile version