సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమైన “శేఖర్”

Published on Nov 2, 2021 1:00 pm IST

రాజశేఖర్ హీరోగా లలిత్ దర్శకత్వం లో రూపొందుతున్న తాజా చిత్రం శేఖర్. థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రాజ శేఖర్ టైటిల్ పాత్ర లో నటిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణ లో వస్తున్న ఈ చిత్రాన్ని ఎంఎల్వీ సత్య నారాయణ, శివాని శివాత్మిక, వెంకట శ్రీనివాస బొగ్గరం లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, మల్లికార్జున నారగని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కి ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం ను సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ శేఖర్ 91 వ సినిమాగా ఈ చిత్రం రానుంది. సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు భారీ సినిమాలు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ నేపథ్యం లో శేఖర్ సినిమా కూడా వస్తుండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :