బాలక్రిష్ణ సినిమాలో ప్రతినాయకుడి పాత్రైనా చేస్తానన్న రాజశేఖర్ !
Published on Oct 31, 2017 3:10 pm IST


సీనియర్ హీరో డా.రాజశేఖర్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘పిఎస్వి గరుడవేగ’. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ అందుకుని మరోసారి హీరోగా నిలబడాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు రాజశేఖర్. ఇకపోతే ఈ చిత్రం తర్వాత తనకు బాలక్రిష్ణతో కలిసి ఒక సినిమా చేయాలని ఉందని, ప్రవీణ్ సత్తారుని బాలక్రిష్ణకు పరిచయం చేస్తూ ఇదే మాటను బాలయ్యతో చెప్పానని, ఆయన కూడా ఓకే అన్నారని తెలిపారు రాజశేఖర్.

అలాగే ఆ సినిమాలో బాలక్రిష్ణతో పాటు మరో హీరోగా చేయాలని కోరికగా ఉందని అది కుదరకపోతే బలమైన ప్రతినాయకుడి పాత్ర ఉంటే అందులో నటించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. మరి రాజశేఖర్ కోరిక మేరకు మంచి కథ కుదిరి త్వరలోనే వీరిద్దరి మల్టీ స్టారర్ రూపుదిద్దుకోవాలి ఆశిద్దాం. భారీ బడ్జెట్ తో రూపొందిన ‘గరుడవేగ’ ఈ నెల 3న రిలీజ్ కానుంది.

 
Like us on Facebook