హీరోగా ‘రాజశేఖర్’ మేనల్లుడు

88
తెలుగు హీరో ‘డా. రాజశేఖర్’ మేనల్లుడు ‘మథన్’ హీరోగా పరిచయమవుతున్నాడు. జేకే మూవీ మేకర్స్ పతాకంపై ఏ. జయకుమార్ నిర్మిస్తున్న ’88’ సినిమాలో మథన్ హీరోగా నటిస్తున్నాడు. అంతేగాకా ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతలని సైతం అతనే నిర్వహిస్తుండటం విశేషం. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం మన సంస్కృతి, సాంప్రదాయాలకు ఏ విధంగా హాని కలిగిస్తుంది అనే అంశంపై ఈ చిత్రం రూపొందుతోందని మథన్ తెలిపాడు.

అంతేగాక సాంకేతిక పరిజ్ఞానం విషయంలో గోప్యాంగా ఉన్న రహస్యాలను బయటపెడితే తలెత్తే సమస్యలను కూడా ఇందూలో ప్రస్తావించనున్నారని తెలిపారు. చెన్నై, కేరళ తదితర రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో మథన్ సరసన 2015 మిస్ ఇండియాగా ఎంపికైన ‘ఉపాసనా రాయ్’ హీరోయిన్ గా నటిస్తోంది.