హీరో రాజశేఖర్ లేటెస్ట్ గా ‘గరుడవేగా’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఆ సినిమా తరువాత రాజశేఖర్కు పలు రైటర్స్ సబ్జక్ట్స్ వినిపించడం జరిగింది. అందులో నూతన దర్శకుడు గోపి చెప్పిన పాయింట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట ఈ హీరో. ఈ సినిమాను రాజ శేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 4న అధికారికంగా ప్రకటించబోతున్నారు.
గోపి గతంలో మణిరత్నం దగ్గర పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసాడు. మంచి కథతో తెరకేక్కబోతున్న ఈ సినిమా లో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాతో పాటు రాజశేఖర్ నటించబోయే మరో సినిమా వివరాలు కూడా ఆయన పుట్టినరోజు అనౌన్స్ చెయ్యబోతున్నారు.
