“శేఖర్” సినిమా వివాదంపై రాజశేఖర్ క్లారిటీ..!

Published on May 23, 2022 11:56 pm IST

సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం “శేఖర్”. మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. హీరో రాజశేఖర్ తనకు డబ్బులివ్వాలని అది తేలేవరకు ‘శేఖర్‌’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఫైనాన్షియర్ పరంధామరెడ్డి సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. అయితే తాజాగా ఈ మూవీ నిలిపివేతపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తోంది. విచారణలో శేఖర్‌ మూవీ ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

అయితే కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలుపలేదని తాజాగా జీవిత రాజశేఖర్‌, నిర్మాత తరపు న్యాయవాదులు తెలిపారు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని కోర్టు చెప్పిందని, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మే 24న విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు. అయితే తాజాగా దీనిపై రాజశేఖర్‌ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆసత్య ప్రచారం వల్ల శేఖర్ సినిమాను నిలిపివేశారని, శేఖర్‌ మూవీపై కోర్టు స్టే ఇచ్చిందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :