టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “రాజా వారు రాణి గారు”

Published on Sep 8, 2023 2:16 pm IST


యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సెప్టెంబర్ 28, 2023న థియేటర్లలో రూల్స్ రంజన్‌గా ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటించింది. రవికిరణ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన నటుడి తొలి చిత్రం రాజా వారు రాణి గారు వార్తల్లో నిలిచింది. ఇది మొదట 2019లో థియేటర్లలో విడుదలైంది. అయితే థియేటర్ల లో రిలీజ్ అయిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత, ఈ చిత్రం బుల్లితెర పైకి రానుంది.

ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 10, 2023న సాయంత్రం 06:30 గంటలకు ETV ఛానెల్‌లో ప్రసారం కానుంది. రహస్య గోరక్ హీరోయిన్ గా నటించగా, రాజ్ కుమార్ కసిరెడ్డి మరియు యజుర్వేద్ గుర్రం ఇతర కీలక పాత్రల్లో నటించారు. దీనిని SL ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై నిర్మించగా, ఈ చిత్రానికి సంగీతం జై క్రిష్ అందించారు.

సంబంధిత సమాచారం :