ఆ ప్రస్తావన తెస్తే ఎన్టీఆర్‌కు చాలా కోపం

ఆ ప్రస్తావన తెస్తే ఎన్టీఆర్‌కు చాలా కోపం

Published on May 28, 2023 6:56 PM IST

ప్రపంచ చలనచిత్రసీమలోనే ఓ అరుదైన అద్భుతం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. మే28 ఎన్టీఆర్ శతజయంతి. 1923 మే 28న కృష్ణాజిల్లా నిమ్మకూరులో కన్ను తెరచిన యన్టీఆర్, తర్వాత జనం మదిలో ‘అన్న’గా నిలచి జేజేలు అందుకున్నారు. ఆయన నటించిన జానపద, పౌరాణిక పాత్రలు మరువలేనివి. శ్రీకృష్ణ పాత్ర 20 సార్లకు పైగా తెరపై కనిపించారు. ఎన్టీఆర్ నటించిన దానవీరశూర కర్ణ ఓ అద్భుతం.

ఇక ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్‌ ఘాట్‌లో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ పుట్టిన నేలపై జన్మించడం అదృష్టమని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ తనకు గురువు, దైవమని చెప్పారు. సినీ రంగంలో ఎంతో మందికి ఆయన సహాయం చేశారని కొనియాడారు. కుల ప్రస్తావన తెస్తే ఎన్టీఆర్‌కు చాలా కోపం వస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ ఉండి ఉంటే ఆయనకు బంగారు పూలతో పాదపూజ చేసే వాడినని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ గొప్పతనం భావితరాలకు తెలియజెప్పాలని రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు