ఆ సినిమాలో రజినీ క్యామియో ఫిక్స్..!

తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్ హీరోగా ఇప్పుడు స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా “జైలర్” లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత కూడా తలైవర్ కొంచెం పటిష్టమైన లైనప్ నే మళ్ళీ సెట్ చేసుకున్నారు. అయితే గత కొన్నాళ్ల కితం రజిని హీరోగా మాత్రమే కాకుండా ఓ సినిమాలో మళ్ళీ గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్టుగా టాక్ వచ్చింది.

అయితే ఇప్పుడు అది నిజమే అని తెలుస్తుంది. తమిళ్ లో హీరో విష్ణు విశాల్ నటిస్తున్న ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ డ్రామా అయినటువంటి లాల్ సలాం అనే చిత్రంలో రజిని క్యామియో రోల్ లో కన్పించనుండడం కన్ఫర్మ్ అయ్యినట్టు ఇప్పుడు తెలిసింది. మరి ఈ చిత్రాన్ని రజినీ కూతురే దర్శకత్వం వహిస్తుండగా రజినీ ఆ రకంగా ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అయితే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version