
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం మాఫియా దాన గా చేస్తున్న ‘కబాలి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా మలేషియా , బ్యాంకాక్ లలో జరుగుతోంది. ఈ నెలాఖరు కల్లా అక్కడ షూటింగ్ ని ఫినిష్ చేసి ఫైనల్ షెడ్యూల్ కోసం చెన్నైకి రానున్నారు. కానీ చెన్నై షెడ్యూల్ కి ముందు రజినీకాంత్ ఓ స్మాల్ బ్రేక్ తీసుకోనున్నారు. ఈ బ్రేక్ టైంలో రజినీకాంత్ ‘రోబో’ సీక్వెల్ కోసం తన లుక్ మీద టెస్ట్ షూట్ చేయనున్నారు.
అందులో భాగంగానే రజినీకాంత్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో డిసెంబర్ 4 నుంచి 6వ తేదీలలో రోబో సీక్వెల్ కోసం టెస్ట్ షూట్ చేయనున్నారు. ఇప్పటికే రజినీకాంత్ లుక్ మీద కొన్ని లుక్స్ డిజైన్ చేసారు. రజినీకాంత్ కి ఏది బెస్ట్ లుక్ అయితే దానిని ఫిక్స్ చేస్తారు. అలాగే డిసెంబర్ 14న రజినీకాంత్ బర్త్ డే కానుకగా ఈ సినిమాని లాంచ్ చేసి జనవరి నుంచి రెగ్యులర్ షూట్ ని మొదలు పెట్టనున్నారు. 3డి ఫార్మాట్ లో తీయనున్న ఈ సినిమాని ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా చేసి ఇంటర్నేషనల్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాడు.
అందుకే రోబో సీక్వెల్ కి ‘రోబో 2’ అనే టైటిల్ కాకుండా మరో సరికొత్త టైటిల్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు. సౌత్ నుంచి ఇంటర్నేషనల్ వరకూ ఓ సినిమాని ఒకే టైటిల్ తో ప్రమోట్ చేయడానికి శంకర్ ఈ సినిమా టైటిల్ ని మార్చే ఆలోచనలో ఉన్నారు.