‘కాల’ సినిమా విషయంలో రజనీని వివరణ కోరిన హై కోర్ట్ !

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘కాల’ డబ్బింగ్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణకు సంబంధించి అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసుకోనుంది. ఇలాంటి తరుణంలోనే ఈ సినిమాపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖరన్ కాపీరైట్స్ చట్టం కింద పిటిషన్ దాఖలు చేశారు.

సినిమా యొక్క ‘కాల’ అనే టైటిల్, కథ రెండిటినీ కొన్నేళ్ల క్రితమే తాను రాసుకున్నానని, ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ కూడా చేయించానని ఆయన పిటిషన్లో అభియోగం వ్యక్తం చేశారు. దీన్ని విచారించితిన్ మద్రాస్ హైకోర్టు ఈ అంశంపై ఫిబ్రవరి 12నాటికి వివరణ సమర్పించాలని రజనీకాంత్, దర్శకుడు పా.రంజిత్, నిర్మాత, రజనీ మేనల్లుడు ధనుష్ ను ఆదేశించాయి. మరి ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందో చూడాలి.