దర్బార్ యూఎస్ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

darbar 2

రజిని కాంత్ దర్బార్ సంక్రాంతి చిత్రాలలో మొదటిగా నిన్న విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులనుండి డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా దర్బార్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ముఖ్యంగా యూఎస్ లో దర్బార్ ఓపెనింగ్ కలెక్షన్స్ బాగున్నాయి. నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు అందిన సమాచారం ప్రకారం దర్బార్ తమిళ వర్షన్ ఒక్కటే 6.15 లక్షల డాలర్ల వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ అందాల్సివుంది. ఇక చెన్నై సిటీలో కూడా దర్బార్ మొదటిరోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. చెన్నై సిటీలో దర్బార్ 2.27 కోట్లు రాబట్టింది.

టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా రజిని ఫ్యాన్స్ కి నచ్చేలా తెరకెక్కించారు. రజిని దర్బార్ చిత్రంలో పోలీస్ అధికారి పాత్ర చేశారు. ఇక హీరోయిన్ నివేదా థామస్ రజిని కూతురిగా సినిమాకు కీలకమైన రోల్ చేయడం జరిగింది. నయనతార హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించారు.

Exit mobile version