రాజకీయ కోణంలో రజనీ సినిమా !

24th, October 2017 - 03:06:52 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న చిత్రాల్లో ‘కాల’ కూడా ఒకటి. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటీకే రజనీ తాలూకు షూట్ పూర్తవగా మొత్తం షూటింగ్ అక్టోబర్ చివరికి ముగియనుంది. ఇకపోతే ఈ సినిమాలో రాజకీయ కోణం కూడా ఉంటుందట. రజనీ రాజకీయ రంగప్రవేశం నైపథ్యంలో ఈ వార్త అధిక ప్రాధాన్యం సంతరించుకుంది.

కొందరైతే ఇది రజనీ పొలిటికల్ అరంగేట్రానికి పనికి వస్తుందని అంటున్నారు. అంతేగాక ఈ సినిమాలో అణచివేతకు గురైన తమిళుల తరపున పోరాడే వ్యక్తిగా రజనీ కనిపిస్తున్నాడని, దీంతో తమిళనాట ఆయనకున్న ఆదరణ మరింతగా పెరిగే అవకాశముందనే మాటలు కూడా నినబడుతున్నాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో, రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి నెలకొంది. మరి అందరూ అంటున్నట్టు ఈ సినిమా రజనీ రాజకీయ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.