“పెద్దన్న” గా తలైవర్..తెలుగులో కూడా క్లారిటీ.!

Published on Oct 15, 2021 9:00 am IST

కోలీవుడ్ తలైవర్ రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “అన్నాత్తే”. రజినీ సినిమాలు అన్నీ కూడా తెలుగులో రిలీజ్ అవుతాయి అని తెలిసిందే. మరి ఈసారి చిత్రం కూడా తెలుగులో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో మంచి ధరకు అమ్ముడుపోయి ఇప్పుడు దసరా కానుకగా తెలుగు టైటిల్ ని రివీల్ చేసుకుంది.

తమిళ్ లో “అన్నాత్తే” గా వస్తున్న ఈ చిత్రం ఇపుడు తెలుగులో “పెద్దన్న” గారిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. నిన్న సినిమా తమిళ్ టీజర్ కూడా వచ్చి భారీ రెస్పాన్స్ ని అందుకోగా ఇప్పుడు తెలుగు పోస్టర్ రిలీజ్ కావడం తెలుగులో రజినీ అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఇక సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా వచ్చే నవంబర్ 4న దీపావళి కానుకగా భారీ లెవెల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :

More