అక్కడ భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్న రజినీ సినిమా.!

Published on Oct 21, 2021 3:00 pm IST


సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “అన్నాత్తే” కోసం అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో “పెద్దన్న” పేరిట రిలీజ్ చెయ్యడానికి కూడా రెడీ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాని ఓవర్సీస్ మార్కెట్ లో భారీ లెవల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ లాక్ డౌన్ అనంతరం ఏ ఇండియన్ సినిమా కూడా రిలీజ్ కానన్ని ఎక్కువ లొకేషన్స్ లో ఈ సినిమా రిలీజ్ ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. దీనిని బట్టి రజినీ క్రేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమా గట్టిగానే ఉండేలా ఉంటుందని మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ సహా కీర్తి సురేష్ తదితర స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించగా డి ఇమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అలాగే సన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More