జపాన్లో వేరే లెవెల్లో మాస్ చూపిస్తున్న రజినీ “దర్బార్”.!

Published on Jul 18, 2021 5:45 pm IST


తమిళ్ తలైవర్ ఆల్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఒక్క మన దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఎప్పుడో ప్రపంచ సినిమానే తన మార్క్ స్టైల్ తో అలరించిన సూపర్ స్టార్ కి ఓ దేశంలో మాత్రం సెపరేట్ క్రేజ్ ఉంది. అదే జపాన్. అక్కడ రజిని సినిమాలకు వచ్చే వసూళ్లు మాములు స్థాయిలో ఉండవు.

ఎప్పుడో వచ్చిన “ముత్తు” సినిమాని అక్కడ డబ్ చేసి వదలగా ఇండియన్ సినిమాల లిస్ట్ లో ఇండస్ట్రీ హిట్ గా చేశారు. దానిని ఇప్పటి ఎన్నో సెన్సేషనల్ హిట్స్ కూడా క్రాస్ చెయ్యలేకపోయాయి. ఇక ఈ సినిమా పక్కన పెడితే తలవైర్ లేటెస్ట్ సినిమా “దర్బార్” జపాన్ లో విడుదల అయ్యినట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ సినిమా అక్కడ వరుసగా మూడు రోజులు హౌస్ ఫుల్స్ తో ఆల్రెడీ వేరే లెవెల్లో అదరగొడుతుందట. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా నివేత థామస్ కీలక పాత్రలో నటించింది. అలాగే అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. మరి ఫైనల్ గా ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :