మరోసారి ఈ దర్శకునికి రజినీ అవకాశం..?

Published on Jun 23, 2022 9:01 am IST

కోలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో “జైలర్” అనే సాలిడ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే వచ్చిన మాస్ పోస్టర్ కూడా ఎనలేని హైప్ ని సెట్ చేసింది. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు తలైవర్ లైనప్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ మరొకటి వినిపిస్తుంది. రజిని కెరీర్ లో ఎంతో హైప్ తో వచ్చిన చిత్రం “కబాలి” ని ఆడియెన్స్ ఎవరు అంత సులువుగా మర్చిపోలేరు.

ఆ సినిమాకి వచ్చిన హైప్ తో సమానంగానే ఈ చిత్రం నిరుత్సాహపరిచింది. అయినా కూడా రజిని మళ్ళీ అదే సినిమా దర్శకుడు పా రంజిత్ కి అవకాశం ఇచ్చారు. దానితో ఆ ఛాన్స్ ని “కాలా” తో పర్వాలేదనిపించాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ దర్శకునికి రజిని తన 170వ సినిమాగా ఛాన్స్ ఇవ్వబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అలాగైతే హ్యాట్రిక్ సినిమాలు ఈ కాంబో నుంచి వచ్చినట్టే అని చెప్పాలి. మరి ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :