‘రోబో 2’ కోసం రెడీ అవుతున్న రజనీకాంత్ !

Rajini-kanth
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ ల కలయికలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘రోబో 2.0’. 2010 లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘రోబో’ కు ఈ చిత్రం సీక్వెల్ గా తెరకెక్కుతోంది. భారతీయ సినీ రంగంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక మిగిలిన షూటింగ్ లో ఎక్కువ భాగం రజనీ మీదే షూట్ చేయాల్సి ఉంది. ‘కబాలి’ తరువాత పూర్తిగా రెస్ట్ టీయూస్కుంటున్న రజనీ సెప్టెంబర్ 23 నుండి చెన్నైలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొననున్నారు.

ఈ షెడ్యూల్లో రజనీ, అక్షయ్ కుమార్, యామీ జాక్సన్ ల మీద కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉండనుంది. అలాగే ఈ చివరి దశ షూటింగ్ ను ఈ షెడ్యూల్లోనే ముగించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇకపోతే ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను నవంబర్ లో విడుదల చేయనున్నారు. అలాగే చిత్రాన్ని వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.