విపరీతంగా వైరల్ అవుతున్న రజిని లత ఫోటో

rajini latha

దర్బార్ మూవీ సెట్స్ ఓ అరుదైన ఫోటోకి వేదికైంది. చైర్ లో కూర్చున్న రజిని కాంత్ ని తన భార్య లత వెనుకనుండి కౌగిలించుకోగా ఒకరు ఫోటో తీశారు. రజిని లతలా జంట ఆ ఫొటోలో నిజంగా సూపర్ గా ఉన్నారు. రజిని కాంత్ లత ల పరిచయం నాటకీయంగా జరిగింది. చెన్నైలోని యెతిరాజ్ కాలేజీ లో లత చదువుకుంటున్న రోజులలో ఆ కాలేజ్ మేగజైన్ కొరకు రజనీని లత ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అలా జరిగిన వారి పరిచయం పెళ్లివరకు వెళ్ళింది. లత కి నటి వైజయంతి మాల బంధువు కాగా ఆమె తమ్ముడు రవి రాఘవేంద్ర నటుడు. రజని లతా ల వివాహం 1981 ఫిబ్రవరి 26న తిరుపతి దేవస్థానంలో జరిగింది. వీరికి ఐశ్వర్య రజిని కాంత్, సౌందర్య రజిని కాంత్ అనే ఇద్దరు కూతురు కలరు.

కాగా ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. ఇక రజిని దర్బార్ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజిని పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. రజిని సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version