కమల్ “విక్రమ్” ని రెండోసారి చూసిన ఇండియాస్ సూపర్ స్టార్.!

Published on Aug 11, 2022 1:01 pm IST


లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఫహద్ ఫాజిల్ విజయ్ సేతుపతి మరియు హీరో సూర్య కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్ర “విక్రమ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ ఈ ఏడాది తమిళ నాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచి కమల్ హాసన్ కెరీర్ లో ఒక భారీ కం బ్యాక్ గానే కాకుండా ఈ సినిమా దెబ్బతో కమల్ హాసన్ కూడా ఆర్ధికంగా ఉన్న ఇబ్బందులు కూడా క్లియర్ చేసుకోగలిగారు.

అయితే ఈ సినిమాని ఇండియాస్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ ఎప్పుడో చూడగా మళ్ళీ రజినీ రెండో సారి ఈ సినిమా చూశారట. దీనితో ఇపుడు ఈ టాక్ వైరల్ గా మారింది. మరి ఈసారి కూడా దర్శకుడు లోకేష్ ని తలైవర్ మెచ్చుకున్నారట. ఇక ఈ సినిమాకి అయితే అనిరుద్ సాలిడ్ సంగీతం అందించగా కమల్ మరియు ఆర్ మహేంద్రన్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :