రేపు ప్రారంభం కానున్న రజినీకాంత్ 170వ మూవీ

రేపు ప్రారంభం కానున్న రజినీకాంత్ 170వ మూవీ

Published on Nov 4, 2022 11:00 PM IST


సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ గా నెల్సన్ దిలీప్ కుమార్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న జైలర్ మూవీలో నటిస్తున్నారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీలో రజినీకాంత్ ఒక పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్, అలానే థీమ్ సాంగ్ ఆడియన్స్ లో మూవి పై మరింతగా అంచనాలు పెంచాయి.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ తరువాత మరొక రెండు సినిమాలు చేయడానికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజినీకాంత్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి ఈ రెండు సినిమాలు చేయనున్నారు రజిని. ఇక ఇందులో భాగంగా నెక్స్ట్ ఆయన నటించనున్న 170వ మూవీ రేపు గ్రాండ్ గా ప్రారంభం కానుంది. కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్ వారితో కలిసి రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ కూడా సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కనున్న ఈ మూవీ గురించిన పూర్తి డీటెయిల్స్ రేపు తెలిసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు