తలైవర్ 173.. టైటిల్ రివీల్ కి డేట్, టైం ఫిక్స్!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు జైలర్ 2 కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ ల కోసం సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ లైనప్ లో తన కెరీర్ 173వ సినిమా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణంలో చేయనున్న ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకరిద్దరు దర్శకులు మారిన తర్వాత ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ని యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించనున్నాడు.

అయితే మేకర్స్ లేటెస్ట్ గా బిగ్ అప్డేట్ ని అందించారు. సినిమా తాలూకా టైటిల్ ను రివీల్ చేస్తున్నట్టు మాస్ పోస్టర్ తో తెలిపారు. రేపు జూన్ 24 ఉదయం సరిగ్గా 10 గంటలకి రివీల్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే ఇదేదో హై టెన్షన్ యాక్షన్ డ్రామాలా కనిపిస్తుంది. సో టైటిల్ ఏంటి అనేది రేపు రివీల్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇతర డీటెయిల్స్ మున్ముందు రానున్నాయి.

Exit mobile version