రోబో 2 విడుదల తేది ప్రకటించిన రజినీకాంత్ !

శంకర్ దర్శకత్వంలో రోబో సినిమాకు సీక్వెల్‎గా ‘2.0’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అత్యంత భారీబడ్జెట్‎తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నాడు. రజినీ సరసన అమీజాక్సన్ హీరోయిన్‎గా నటిస్తోన్న ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించాడు రజినీకాంత్. తాజాగా రజినీకాంత్ అభిమానులు ఆయన్ను కలుస్తున్నారు. ఆ సందర్భంలో రజినీకాంత్ మాట్లాడుతూ రోబో 2 సినిమా ఏప్రిల్ 14 న విడుదల కానుందని వెల్లడించాడు. డిసెంబర్ 31 న తన రాజకీయ రంగప్రవేశం గురించి ప్రకటించబోతున్నాడుసూపర్ స్టార్.