సూపర్ స్టార్ రజినీకాంత్ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ !

Published on Nov 1, 2021 9:00 am IST

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. రజనీ హెల్త్ అప్ డేట్ పై ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు టెన్షన్ గా ఎదురుచూశారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందిన రజనీకాంత్‌, నిన్న రాత్రి హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రజనీ ఆరోగ్యం నిలకడగా ఉంది. అసలు రజనీ ఉన్నట్టు ఉండి ఆసుపత్రిలో చేరడానికి గల కారణం.. నాలుగు రోజుల క్రితం రజనీ అస్వస్థతకు గురి అయ్యారు.

వెంటనే ఆయన కుటుంబ సభ్యులు కావేరి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. రజిని మెదడు రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకుల (బ్లాక్స్‌)ను వైద్యులు చికిత్స చేసి తొలగించారు. ఇక రజినీకాంత్ హాస్పిటల్‌ లో ఉన్నప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరామర్శించారు. రజనీ త్వరలోనే కోలుకుని ఇంటికి చేరుకోవాలని స్టాలిన్‌ ఆకాంక్షించారు.

సంబంధిత సమాచారం :