సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు చేస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ ‘జైలర్ 2’ పట్ల ఎలాంటి హైప్ నెలకొందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత కూడా రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు రజినీకాంత్ చేస్తున్నారు. కానీ ఇవి కాకుండా ఒక స్పెషల్ ప్రాజెక్ట్ విషయంలో రజినీకాంత్ ఎమోషనల్ కావడం ఇప్పుడు వైరల్ గా మారింది.
ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ఊహించని విధంగా కాలం చేసిన సంగతి తెలిసిందే. దీనితో తమిళ్ సహా తెలుగు సినీ ప్రముఖులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యారు. అయితే ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన రజినీకాంత్ ఆర్బీ చౌదరి గారితో జరిగిన ఓ సంభాషణను రివీల్ చేశారు. తాను జైలర్ 2 చేస్తున్న సమయంలోనే చౌదరి గారు కాల్ చేసారని.
తన బ్యానర్ లో ఇప్పుడు వరకు 99 సినిమాలు చేసాం కానీ మీతో ఇప్పటివరకు సినిమా చేయడం కుదరలేదు తమ బ్యానర్ 100వ సినిమా రజినీతో చేయాలని కోరినట్టు తెలిపారు. అలాగే అందుకు తాను కూడా ఓకే చెప్పినట్టు రజినీ రివీల్ చేశారు. కానీ తమ బ్యానర్ లో ఆ బెంచ్ మార్క్ సినిమా చేసే లోపే ఇంతటి విషాదం జరిగింది అని తలైవర్ ఎమోషనల్ కావడం ఇప్పుడు మరింత విషాదంగా మారింది.
