లేటెస్ట్ : ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి ని ఇంటికి పిలిపించి అభినందించిన రజినీకాంత్

లేటెస్ట్ : ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి ని ఇంటికి పిలిపించి అభినందించిన రజినీకాంత్

Published on Oct 29, 2022 3:01 AM IST

ప్రస్తుతం కన్నడతో పాటు పలు ఇతర భాషల్లోస్ సైతం అత్యద్భుత విజయం దిశగా దూసుకెళుతూ భారీ కలెక్షన్స్ అందుకుంటున్న మూవీ కాంతార. ఇక ఈ మూవీని హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఎంతో భారీ స్థాయిలో నిర్మించగా హీరోయిన్ సప్తమి గౌడ నటించారు. డివైన్ బ్లాక్ బస్టర్ గా కొనసాగుతున్న కాంతార మూవీ పై ఎందరో ప్రేక్షకులతో పాటు అనేకమంది సినిమా ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ మూవీలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

కాగా మొన్న ఈ మూవీని ప్రత్యేకంగా చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్, కాంతార టీమ్ ని అలానే హీరో రిషబ్ శెట్టి, హీరోయిన్ సప్తమి గౌడ, నిర్మాత విజయ్ కిరగాందూర్ ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు తెలియచేసారు. అయితే విషయం ఏమిటంటే, నేడు కొద్దిసేపటి క్రితం కాంతార హీరో రిషబ్ శెట్టిని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించి శాలువాతో సత్కరించిన రజిని, అతడిని మూవీ విషయమై ఎంతో గొప్పగా అభినందించారు. ముఖ్యంగా కాంతార సినిమాలో ప్రతి ఒక్క పాత్ర సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉందని, రిషబ్ శెట్టి యాక్టింగ్ తో పాటు సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు ఎంతో బాగా నచ్చాయని రజినీకాంత్ తెలిపారట. మొత్తంగా రిషబ్ ని రజిని ఇంటికి పిలిపించి మరీ అభినందించడంతో కాంతార మూవీకి మరింతగా హైప్ దక్కిందని అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు