రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్.. అసలు ఏమయ్యిందంటే..!

Published on Oct 29, 2021 11:04 pm IST


సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థ్తకు గురికావడంతో నిన్న రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రజినీ కాంత్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే రజినీ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కావేరీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించిన వైద్యులు తగిన చికిత్సను అందిస్తున్నారు. ఈ రోజు సర్జరీ చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి‌ రజినీకాంత్‌ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో “పెద్దన్న” అనే టైటిల్‌తో విడుదల కానుంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం :