చెప్పకపోయినా సహాయం చేసినా రజనీకాంత్

Rajinikanth1

గత ఏడాది సంభవించిన గజ తుఫాన్ కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అలా దెబ్బతిన్న ప్రాంతాల్లో నాగపట్నం కూడా ఒకటి. ఈ ప్రాంతవాసుల్లో ఇళ్లు సైతం కోల్పోయి నిస్సహాయులుగా మిగిలిన పది పేద కుటుంబాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద సహాయమే చేశారు.

ఆ పది కుటుంబాలకు రజనీ సొంత డబ్బుతో ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఈ యేడాది మార్చి నెలలో ఈ ఇళ్లకు శంఖుస్థాపాన జరగ్గా నేటికి అవి పూర్తై బాధితులకు అందాయి. అంతేకాదు రజనీ ఆ పది కుటుంబాలను నేరుగా ఇంటికి పిలిచి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ కూడా ఇచ్చారట.

తుఫాన్ సమయంలో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా రజనీ ఇలా తమకు సహాయం చేయడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులైతే తమ హీరో మంచి మనసు చూసి పొంగిపోతున్నారు. ఇకపోతే మురుగదాస్ డైరెక్షన్లో రజనీ నటించిన ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Exit mobile version