సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక..!

Published on Oct 29, 2021 1:34 am IST


సూపర్ స్టార్ రజనీకాంత్ స్వల్ఫ అస్వస్థతకు గురయ్యారు. కాస్త అనారోగ్యంగా ఉండడంతో ఈ రోజు సాయంత్రం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్ ఆసుపత్రిలోనే ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఆయన ఆరోగ్యంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో “పెద్దన్న” అనే టైటిల్‌తో విడుదల కానుంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకోగా నేడు ‘రా సామీ’ అంటూ సాగే పవర్‌ఫుల్‌ సాంగ్‌ (లిరికల్‌ వీడియో)ను చిత్ర బృందం విడుదల చేసింది.

సంబంధిత సమాచారం :

More