సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “జైలర్ 2”. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో వచ్చిన మొదటి పార్ట్ ఎలాంటి సెన్సేషన్ సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక దానికి కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ అందించారు.
సినిమా తాలూకా మొత్తం షూట్ ని ఇప్పుడు కంప్లీట్ చేసినట్టు మేకర్స్ సెట్స్ నుంచి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్న పిక్స్ తో రివీల్ చేశారు. సో జైలర్ పార్ట్ 2 షూట్ మొత్తం పూర్తయ్యింది. ఇక రిలీజ్ డేట్ ఒక్కటి మాత్రమే బాకీ ఉందని చెప్పాలి. ఇదెప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. ఈసారి కూడా పలు ఊహించని క్యామియోలు ఉంటాయనే టాక్ ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
