షూటింగ్ పూర్తి చేసుకున్న రజినీకాంత్ ‘జైలర్’

Published on Jun 1, 2023 11:02 pm IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తమన్నా భాటియా హీరోయిన్ గా తాజగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ జైలర్. రజినీకాంత్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్న జైలర్ మూవీ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న జైలర్ మూవీ షూటింగ్ మొత్తం నేటితో పూర్తి అయింది. కాగా షూట్ కి గుమ్మడికాయ కొట్టిన అనంతరం యూనిట్ కేక్ కట్ చేశారు.

కొద్దిసేపటి క్రితం కేక్ కటింగ్ పిక్స్ ని మేకర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. కాగా జైలర్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 10న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న జైలర్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, నాగబాబు, జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :