తలైవా రజినీకాంత్ ప్రస్తుత్తం ‘ఫిజ్జా’ ఫెమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్నారని తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ డార్జిలింగ్ లోని కాలేజ్ లో జరుగుతుంది. తొందర్లోనే ఈ షెడ్యూల్ ముగియనుంది. దీని తరువాతి షెడ్యూల్ ను మధురై లో ప్లాన్ చేశారట చిత్ర యూనిట్. ఇంతకుముందు కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించిన ‘జిగర్ తాండ్ర’ చిత్ర షూటింగ్ కూడా అక్కడే జరిగింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈచిత్రానికి కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు ఈ దర్శకుడు.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి , బాబీ సింహ, మేఘా ఆకాష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
