రజనీతో పా. రంజిత్ చేయబోయేది ‘కబాలి’ సీక్వెల్ కాదట !

Pa-Ranjith
ఈ సంవత్సరంలో కనీవినీ ఎరుగని రీతిలో బ్రహాండమైన క్రేజ్ తో విడుదలైన చిత్రం రజనీకాంత్ నటించిన ‘కబాలి’. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అభిమానులు ఆశించిన రీతిలో లేక మంచి వసూళ్లను సాధించిందేగాని భారీ హిట్ గా మాత్రం నిలవలేకపోయింది. ఇప్పుడు అదే పా. రంజిత్ మరోసారి రజనీ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. వండర్ బాల్ ఫిలిమ్స్ బ్యానర్ పై రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ ప్రకటన వెలువడ్డప్పటి నుండి ఈ సినిమా ఖచ్చితంగా ‘కబాలి’ కి సీక్వెల్ అని వార్తలు వినిపించాయి.

కానీ ఓ ప్రముఖ ఛానెల్ కు చ్చిన ఇంటర్వ్యూలో పా. రంజిత్ మాట్లాడుతూ ఈ సినిమా ‘కబాలి’ కి సీక్వెల్ కాదని, కొత్త కథని తెలిపాడు. అలాగే మొత్తం స్క్రిప్ వర్క్ పూర్తయ్యాక మిగతా వివరాలు తెలుపుతానని కూడా అన్నాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు కథ ఏదైనా ఈసారి రాబోయే రజనీ చిత్రం పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న రజనీ త్వరలో శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘రోబో2.0’ చిత్రం రెగ్యులర్ షూట్ లో పాల్గొంటారు.