“పెద్దన్న” ట్రైలర్ రిలీజ్.. రజినీ మరోసారి దుమ్ములేపాశాడుగా..!

Published on Oct 27, 2021 8:33 pm IST

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం అన్నాత్తే. తెలుగులో “పెద్దన్న” అనే టైటిల్‌తో విడుదల కానుంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది.

ట్రైలర్‌ని చూస్తుంటే ఫుల్ మాస్ యాంగిల్‌లో సినిమా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఎప్పటిలాగానే రజనీకాంత్‌ తనదైన స్టైల్, యాక్షన్ కామెడీ, డైలాగులతో మరోసారి దుమ్ముదులిపేశాడు. ట్రైలర్‌ని చూశాక ఈ సినిమాపై తలైవా అభిమానుల అంచనాలు మరింత పెరిగిపోయి ఉంటాయనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో రజనీకాంత్ చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటించగా, రజనీకి జోడీగా నయనతార నటించింది. మీనా, ఖుష్బూ, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు డి. ఇమ్మాన్‌ సంగీతం అందించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More