దర్బార్ లో తలైవా డ్యూయెల్ రోల్ !

Dharbar

సూపర్ స్టార్ రజినీకాంత్ – ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. ప్రస్తుతం ఈచిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది. సుమారు 20రోజుల పాటు జరుగనున్న ఈషెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ రెండు పాత్రల్లో నటించనున్నారు. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా మరొకటి సమాజ సేవకుడిగా కనిపించనున్నారు.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్థార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రం భారీ అంచనాల మధ్య తెలుగు , తమిళ , హిందీ భాషల్లో వచ్చే ఏడాది పొంగల్ కు విడుదలకానుంది.

Exit mobile version