అందుకే రాజకీయాలకు దూరమయ్యాను – రజినీకాంత్

Published on Mar 12, 2023 9:37 pm IST


సూపర్ స్టార్ రజినీకాంత్ తాను ఎందుకు రాజకీయ అరంగేట్రం చేయలేదు అనేదాని పై తాజాగా క్లారిటీ ఇచ్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండడం వల్లే రాజకీయాలకు దూరమైనట్టు ఆయన చెప్పారు. తాను ఆ సమస్యకు చికిత్స పొందుతూ రాజకీయాల్లోకి వస్తే తన ఆరోగ్యానికి మంచిది కాదు అని, డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తనకు సలహా ఇచ్చారని రజనీకాంత్ అన్నారు.

అయితే, తాను ఆ మాటలను సీరియస్ గా తీసుకోలేదు అని, ఐతే, అప్పట్లో తాను బహిరంగ సభల్లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకనే ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను అని తాజాగా రజనీకాంత్ తెలియజేశారు. తాను ఈ విషయాలు అప్పుడే చెప్పి ఉంటే.. తాను భయపడుతున్నానని అందరూ అనుకుంటారని, అందుకనే ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని తాజాగా రజనీకాంత్ చెప్పారు.

సంబంధిత సమాచారం :