డబ్బింగ్ మొదలుపెట్టిన సూపర్ స్టార్

21st, January 2018 - 04:41:45 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న చిత్రాల్లో ‘కాల’ కూడా ఒకటి. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చివరి దశ పనుల్లో ఉంది. రజనీకాంత్ కూడా ఈరోజు నుండి తన పాత్ర తాలూకు డబ్బింగ్ ప్రారంభించారు.

ముంబై మాఫియా నైపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రజనీ ధారావి అనే ప్రాంతంలో తమిళుల కోసం పోరాడే వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో రజనీ సరసన బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి కథానాయకిగా నటిస్తుండగా నానా పాటేకర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ధనుష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘2 పాయింట్ 0’ విడుదల తర్వాత రిలీజ్ చేయనున్నారు.